బరువు తగ్గటానికి….అల్లం నీరు(జింజర్ వాటర్)…ఎలా తీసుకోవాలి

Ginger water benefits : మనం ప్రతి రోజు వంటల్లో ఎక్కువగా అల్లంను ఉపయోగిస్తూ ఉంటాం. అల్లంలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, మినరల్స్, విటమిన్స్,అనేక ఇతర పోషకాలు ఉండుట వలన మన శరీరంలో కొవ్వు కరిగించటానికి సహాయపడతాయి.

ఈ అల్లం నీటిని త్రాగటం వల్ల పొట్ట,నడుము,తోడ బాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కొవ్వు కరగటం వల్ల బరువు సులభంగా తగ్గటానికి అల్లం సహాయపడుతుంది.

ఇప్పుడు అల్లం నీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
అల్లం
నీరు

పద్దతి
అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి మరిగించాలి. మొదట 10 నిముషాలు హై మంట మీద ఉంచి, తర్వాత 15 నిముషాలు సిమ్ లో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ప్రతి రోజు సుమారుగా ఒక లీటర్ అల్లం నీటిని త్రాగితే కొవ్వు కరిగి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.