బరువు తగ్గటానికి 6 అద్భుతమైన ఐడియాలు

Weight Loss Tips In telugu :ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గటానికి తిండి మానేయటం మరియు మందులు వాడటం వంటివి చేస్తూ ఉంటారు.

ఈ విధంగా చేయటం వలన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు రాకుండా సులువుగా బరువు తగ్గే విధానం తెలుసుకుందాం.

1. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అవిసె గింజల పొడి, ఒక స్పూన్ తేనె కలిపి రాత్రి పడుకొనే ముందు త్రాగాలి. ఈ పానీయం పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తుంది.

2. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే కొవ్వు తగ్గటానికి సహాయపడుతుంది.

3. గ్రీన్ టీలో ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలుపుకొని రోజుకి రెండు సార్లు త్రాగాలి.

4. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నువ్వుల నూనె,ఒక స్పూన్ అల్లం రసం కలిపి రోజులో రెండు సార్లు తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

5. భోజనం చేయటానికి ముందు రెండు స్పూన్ల క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను గ్లాస్ నీటిలో కలిపి త్రాగాలి.
6. ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే కొవ్వు కరుగుతుంది.