‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Aadavari Matalaku Arthale Verule Movie :తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఎక్కువగా విక్టరీ వెంకటేష్ మూవీస్ చూస్తూ అభిమానిగా మారిపోయాడు. తమిళ మూవీ డైరెక్షన్ అయ్యాక తెలుగులో వెంకీ హీరోగా సినిమా చేయాలన్న ప్లాన్ తో ఓ కథ రాసాడు. ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ పదేళ్లుగా తండ్రిపై ఆధారపడే ఓ వ్యక్తికి సడన్ గా ఓ అమ్మాయి పరిచయం అయితే జరిగే మార్పులు ఎలా ఉంటుందో అదే ఈ కథ. సెల్వ రాఘవన్ ఫ్రెండ్ విషయంలో జరిగిన యదార్ధ గాధను ఇతివృత్తంగా మలిచి కథ రాసాడు. ఇక అదే సమయానికి ప్రొడ్యూసర్స్ నాగవెంకట అశోక్ కుమార్, ఎన్వీ ప్రసాద్ లు సెల్వ రాఘవన్ ని కల్సి ఓ సినిమా చేయమని అడిగారు. అప్పటికే వాళ్ళు వెంకీతో వసంతం సూపర్ హిట్ మూవీ నిర్మించారు. అయితే వసంతం తీసిన విషయం తెలియక, సెల్వ రాఘవన్ నేరుగా హైద్రాబాద్ వచ్చి వెంకీని కల్సి కథ ఉందని చెప్పడంతో ప్రస్తుతం ఖాళీలేదన్నారు.

రెండేళ్ల తర్వాత పిలుపు రావడంతో వెళ్లి కథ చెప్పడం, నచ్చేయడం, సినిమాకు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని టైటిల్ పెట్టడానికి కూడా వెంకీ ఒకే చెప్పడం జరిగింది. యువన్ శంకర్ మ్యూజిక్. కీలక పాత్రకు కె విశ్వనాధ్ ఒకే. 2006ఫిబ్రవరి 3న ఈ సినిమాకు రామానాయుడు స్టూడియోలో చిరంజీవి క్లాప్ కొట్టారు. అయితే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి పెళ్లి ఫిక్స్ కావడంతో హీరోయిన్ గా చేయడం లేదని చెప్పేసింది. దీంతో చాలామందిని అనుకున్నా కుదరలేదు. జ్యోతికను తీసుకున్నారు. షూటింగ్ రెగ్యులర్ గా స్టార్ట్ చేయాలనీ అనుకునే సమయానికి జ్యోతికకు సూర్యతో పెళ్లి ఫిక్స్. దాంతో త్రిష హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. మరోపక్క తులసి మూవీ కూడా వెంకీ కమిట్ అయ్యాడు. కలర్ స్వాతిని కూడా వేరే పాత్రకు తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ శరవేగంగా సాగింది. రామోజీ ఫిలిమ్ సిటీ, రామా నాయుడు స్టూడియో , న్యూజిలాండ్ లో ఓ సాంగ్, కొంత షూటింగ్ చేసారు. ఇక విలేజ్ సీన్స్ అన్నీ రాజమండ్రిలో తీశారు. సాఫ్ట్ వేర్ కంపెనీ షూటింగ్ బెంగుళూరులో చేసారు.

అయితే తులసి మూవీ షూటింగ్ లో వెంకీ భుజానికి గాయం అయింది. దాంతో మరోనెల వాయిదా. కోలుకున్నాక మార్చి నెలాఖరుకి షూటింగ్ కంప్లిట్ చేసారు. మార్చి 28న ఆడియో రిలీజ్. సాంగ్స్ సూపర్భ్ . 2007ఏప్రియల్ 27న 267థియేటర్స్ లో మాత్రమే మూవీ రిలీజ్. సరదా, వినోదం, ఎమోషన్ సీన్స్ తో పక్కా స్క్రీన్ ప్లే తో సినిమా సాగిపోవడం జనానికి నచ్చేసింది. తండ్రి కోట శ్రీనివాస రావు మీద ఆధారపడిపోయి బతికేస్తూ, చివరకు తండ్రి పోయాక అయన కన్న కలలు తెలుసుకుని, బైక్ విడిపించి తుడుస్తుంటే , కంట తడి పెట్టాల్సిందే. సెకండాఫ్ కూడా లవ్, ఎమోషన్, కామెడీ సన్నివేశాలతో పండింది. ఉత్తమ నటుడిగా నంది అవార్డు వెంకీకి దక్కింది. బెస్ట్ ఫిలిం గా కూడా నంది గెలుచుకుంది. త్రిషకు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. 21సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ విజయవాడ సిటీలో 67లక్షలు కలెక్ట్ చేసి టాప్ గ్రాసర్ గా నిల్చింది. టోటల్ 20కోట్లు కలెక్ట్ చేసి, 2007టాప్ సిక్స్ మూవీస్ లో ఒకటిగా నిలవడమే కాక అప్పటిదాకా వెంకీ మూవీస్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీగా కూడా ప్రశంసలు అందుకుంది.