చంటి సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?

Chanti Full Movie :వెంకటేష్ మీనా కాంబినేషన్ లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే ఈ సినిమా విడుదలయ్యే దాదాపుగా 29 సంవత్సరాలు అయింది. ఈ సినిమాలో వెంకటేష్ మీనా అద్భుతంగా నటించారు. ఈ సినిమా తమిళంలో హిట్టయిన చిన్న తంబీ సినిమాకు రీమేక్. చంటి సినిమా లో వెంకటేష్ అమాయకమైన పల్లెటూరి యువకుని పాత్రలో నటించారు. ఈ సినిమాలో మొదటగా హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని అనుకున్నారట. ఆ సమయంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట.

ఈ సినిమా రీమేక్ రైట్స్ కేఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ సినిమా లో హీరోగా చేయటానికి రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించారట. ఈ సినిమా వెంకటేష్ సురేష్ బాబు కూడా బాగా నచ్చడంతో కె.ఎస్.రామారావు రవిరాజా పినిశెట్టి ని వెంకటేష్ హీరోగా పెట్టి చేయమని చెప్పారట. అయితే రవిరాజా పినిశెట్టి రాజేంద్ర ప్రసాద్ కి మాట ఇచ్చాను చేస్తే ఆ హీరో తోనే చేస్తాను అని పట్టుబట్టారు అట. అప్పుడు చిరంజీవి రవిరాజా పినిశెట్టి ని ఒప్పించటంతో వెంకీ మీనా లతో ఈ సినిమా తెరకెక్కింది.