తొడ లేదా పిక్క కండరాలు పట్టేస్తే…ఏమి చేయాలి?

Muscle Cramps :కొందరికి కండరాలు అకస్మాత్తుగా బిగదీసుకుపోయినట్లుగా పట్టేసి విపరీతమైన బాధగా ఉంటుంది. కొందరికి ఇది నిద్రలో జరిగి బాధతో మెలకువ వస్తుంది. వీటిని మజిల్ క్రాంప్స్ అంటారు.

నిద్రలో కాలు లేదా తొడ లేదా పిక్క కండరాలు పట్టివేస్తే కాలు నేలకు ఆన్చలేనంతగా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు పాదాన్ని నేలకు ఆన్చి కాసేపు తిరగాలి. కొద్దిసేపట్లో బాధ తగ్గుతుంది.

శరీరంలో ద్రవాలు, ఖనిజ లవణాలు తగ్గడంతో ఈ పరిణామం సంభవిస్తుంది. కాబట్టి దీన్ని నివారించేందుకు లేదా వచ్చినప్పుడు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఎక్కువ నీళ్లను, ద్రవాహారాన్ని తీసుకోవాలి.

ఖనిజ లవణాలు ఎక్కువగా అందడానికి గాను కొబ్బరినీళ్లు తాగడం మంచిది. దీనివల్ల శరీరానికి అవసరమైన నీళ్లు (హైడ్రేషన్), లవణాలు… రెండూ సమకూరుతాయి. ఇలా తరచూ కండరాలు పట్టేసేవారు అరటిపండ్లు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.