బెల్లంకొండ అల్లుడు అదుర్స్ ఎలా ఉంది.. హిట్టా ఫట్టా.. ట్విట్టర్ రివ్యూ..

Alludu Adurs Twitter Review :సంతోష్ శ్రీ‌నివాస్ దర్సకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. రాక్షసుడు సినిమా తర్వాత వస్తున్న సినిమా కావటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా అల్లుడు అదుర్స్ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే టాక్ ఓవర్‌సీస్ నుంచి వినిపిస్తోంది. సంక్రాంతి అల్లుడి కామెడీ బాగానే పండిందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాస్త స్లోగా నేరేట్ చేశాడని ట్వీట్స్ వస్తున్నాయి.

అల్లుడు అదుర్స్ మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పాలి. దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కొంతమంది అభిమానులు సినిమా కొంచెం సాగతీత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సోనూ సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.