1700 కోట్లు.. మతిమరపు తో పాయే..

Bitcoin Price :అమెరికా లో వాషింగ్టన్ లో నివసించే స్టీఫెన్ ధామస్ ఎపుడో డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ ధర చాలా తక్కువగా ఉన్నపుడు 7000 బిట్ కాయిన్స్ ను కొని స్ట్రాంగ్ పాస్ వర్డ్ తో భద్రపరిచాడు.

అయితే ఈ మధ్య కాలం లో ఒక బిట్ కాయిన్ ధర 25 లక్షలు పై మాటే పలకడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని మొత్తం కాయిన్స్ విలువ 1750కోట్లు అయింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు అతనికి. కారణం ఏమంటే పాస్ వర్డ్ మరచిపోయాడు. పాస్ వర్డ్ అటెంప్ట్ చేయడానికి 10 ఛాన్స్ లు ఉంటే, ఇప్పటికే 8 తప్పు పాస్ వర్డ్ లు ఎంటర్ చేసేసాడు. ఇంక రెండు ఛాన్స్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఛాన్స్ లతో అతని అదృష్టం తేలిపోతుంది. మళ్ళీ తప్పు కొడితే అతని ఆశలు ఆవిరైపోయినట్లే.