క్రాక్ సినిమాకి 5గురు దర్శకులు…ఎలాగో చూస్తే షాక్ అవుతారు

Krack Movie :గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ,శృతి హాసన్ హీరో హీరోయిన్ లుగా నటించిన క్రాక్ సినిమా కోసం 5 గురు దర్శకులు పనిచేశారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇది నిజం. క్రాక్ సినిమా జనవరి 9 న రిలీజ్ అయి పొజిటివ్ టాక్ సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక 5 గురు దర్శకుల విషయానికి వస్తే…ఈ సినిమాలో టాలీవుడ్,కోలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకులు సముద్రఖని, బీవీఎస్ రవి, వివేక్ కృష్ణ, మహేష్ కత్తి, దేవీ ప్రసాద్ ఈ సినిమాల్లో నటించారు.

విలన్ కటారీ కృష్ణ పాత్రలో సముద్రఖని,మహేష్ కత్తి కుల సంఘం అధ్యక్షుడిగా,వివేక్ కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా,చాలా సినిమాలకు రచయితగా పని చేసి దర్శకునిగా మారిన బీవీఎస్ రవి సైతం ఈ సినిమాలోని ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం.శ్రీవిష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాకు డైరెక్టర్ గా పని చేసిన దేవీ ప్రసాద్ సైతం ఈ సినిమాలో ఎస్సై తిలక్ పాత్రలో నటించి మెప్పించారు.ఇలా గోపీచంద్ మలినేని కాకుండా ఐదుగురు దర్శకులు ఒకే సినిమాలో నటించడం గమనార్హం.