రామ్ పోతినేని రెడ్ సినిమా ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే…
Red movie review in telugu :స్రవంతి రవి కిషోర్ నిర్మాతగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన రెడ్ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా వచ్చింది.సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 9న సమ్మర్లో విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడి ఈ రోజు విడుదల అయింది.
ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఈ సినిమాలో నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్లు హీరోయిన్ లుగా నటించారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామ్ ఈ సినిమాలో సిద్దార్థ్, ఆదిత్యగా రెండు విభిన్న షేడ్స్‌లో నటన అద్భుతమైన నటనతో మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేశాడు.
కథ చాలా ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్, అలాగే కామెడీ సీన్స్ పెద్దగా పండలేదనే వార్తలు వస్తున్నాయి.
ఫస్టాఫ్ స్లోగా ఉండి యావరేజ్ అని,సెకండ్ ఆఫ్ లో సినిమా కాస్త పుంజుకొని ఎంటర్టైన్ చేసిందని అంటున్నారు. కథ కాస్త సాగదిస్తూ సాగిందని అని ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుస్తుంది. ఈ రివ్యూ ద్వారా రెడ్ సినిమా మీద మిశ్రమ స్పందన ఉంది.