క్షణ క్షణం సినిమా గురించి ఈ నిజాలు తెలుసా…అసలు నమ్మలేరు

Kshana Kshanam Movie : రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, శ్రీదేవి కల్సి నటించిన క్షణం క్షణం మూవీ ఎంతటి హిట్ అయిందో చెప్పక్కర్లేదు. వినోదం , హాస్యం మేళవించి సస్పెన్స్ త్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీలో సత్య పాత్రలో శ్రీదేవి నటన సూపర్భ్. శివ తీసే సమయానికి సాధారణ మూవీ. అది ట్రెండ్ సెట్టర్ కావడంతో క్షణ క్షణం మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పైగా తన వీరాభిమాని రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలో మొదటిసారి వెంకీ పక్కన శ్రేదేవి చేస్తున్న ఈ మూవీ పై జనంలో ఆసక్తి పెంచేసింది. కెమెరామెన్ ఎస్ గోపాలరెడ్డి ఒకరోజు నిర్మాతలు డాక్టర్ కె ఎల్ నారాయణ, వై లక్షణ చౌదరి లను వెంటబెట్టుకుని వర్మ దగ్గరకి వెళ్లారు. వెంకీ, శ్రేదేవి డేట్స్ మా దగ్గర ఉన్నాయి. ఓ సినిమా చేస్తారా అని అడిగేసరికి, స్టూడెంట్ లైఫ్ నుంచి అభిమానించే శ్రీదేవితో సినిమా అనగానే వర్మ కళ్ళు మెరిసాయి. వెంటనే ఓ కథ చెప్పాడు. నిర్మాతలకు నచ్చేయడంతో శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రయత్నాలు స్టార్ట్ చేసేసారు.

డైలాగ్ రైటర్ గా సత్యానంద్ ని తీసుకుని డైలాగ్స్ సింపుల్ గా ఉండాలని వర్మ చెప్పేసాడు. కోటి రూపాయలు దాచిన లగేజి బాగ్ దాచిన సందర్బంగా రైల్వే కూపన్ నెంబర్ ఆధారంగా టైటిల్ 24అనో, 361అనో పెట్టాలని అనుకున్నారు. 24గంటలు, 48గంటలు అని కూడా అనుకున్నారు. చివరకి క్షణ క్షణం అని పెట్టారు. పరేష్ రావెల్ ని విలన్ గా తీసుకున్నారు. మరోచరిత్రలో నటించిన వరువిరల్ కృష్ణారావు ఎక్కడ ఉన్నదో తెలుసుకుని మరీ ఇందులో వేషం ఇచ్చారు.

కీరవాణి ని మ్యూజిక్ డైరెక్టర్ గ పెట్టుకున్నారు. జాము రాతిరి జాబిలమ్మ ట్యూన్ కి వర్మ ఒకే చెప్పేసారు. కర్ణాటక అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేసారు. వెన్నెలకంటి జుంబారే పాట రాయగా, మిగిలిన వన్నీ సీతారామ శాస్త్రి రాసారు. ఓ పాటలో శ్రీదేవి చేత కూడా పాడించారు. సికింద్రా బాద్ వైశ్యా బ్యాంకు లో శ్రీదేవి ఆఫీసు సన్నివేశం తీశారు. శ్రీదేవితో పాటు హేమ ఒక్కర్తే ఇందులో ఉంటుంది. నువ్వే సెకండ్ హీరోయిన్ అని హేమతో కో డైరెక్టర్ శివ నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఒక్కరోజులోనే ఆమె షూటింగ్ అయిపొయింది. ఇదేమిటని అడిగియే ఇంకెవరు ఉండరు అందుకే ఒక్కరోజులో అయినా నువ్వే సెకండ్ హీరోయిన్ అని శివనాగేశ్వరరావు నవ్వేశారట.

మూవీ ప్రారంభ సన్నివేశం కోసం పౌర్ణమి రాత్రుల్లో హైదరాబాద్ లో తీశారు. ఒక్క షాట్ కి మూడు నాలుగు గంటలు పట్టేదట. రైల్వే సీన్ ప్రకాశం జిల్లా, నంద్యాల ప్రాంతాల్లో షూట్ చేసారు. రైల్ ఇంజన్ పట్టాలు దాటి వచ్చేయడంతో పట్టాలు ఎక్కించడం కోసం చాలా శ్రమించారు. 50రోజుల్లో సినిమా తీసినా పూర్తికావడానికి ఏడాది పట్టింది. ఎందుకంటే శ్రీదేవి తండ్రి ఆసుపత్రి పాలవ్వడం, చనిపోవడంతో కొన్ని రోజులు షూటింగ్ చేయలేదు. కోటిన్నర ఖర్చయింది. 1991అక్టోబర్ 9న 4ట్రాక్ సౌండ్ సిస్టం లో క్షణ క్షణం రిలీజ్. మొదట్లో యావరేజ్ అనుకున్న సినిమా సెకండ్ రన్ లో సూపర్ హిట్ అయింది. అందం, అమాయత్వం, భయం మేళవించి శ్రీదేవి చేసిన నటన అదిరిపోయింది. బ్రహ్మానందం కొంచెం సేపు కన్పించినా హాస్యంతో అదరగొట్టేసాడు. విలన్ పాత్రకు పరేష్ రావెల్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. తమిళం, హిందీలో కూడా ఈ మూవీ అనువాదం అయింది.