మాస్ మహారాజ్ కి తొలి చెక్కు ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

RaviTeja Krack Movie :సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో ఆటుపోట్లుంటాయి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అలాగే టాలీవుడ్ మాస్ రాజా రవితేజ తన కెరీర్ లో హీరోగా ఎన్నో హిట్స్, ప్లాపులు చవిచూశాడు. యాక్టింగ్ కామెడీ తో ఆకట్టుకునే రవితేజ ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ముఖ్యంగా గతేడాది రవితేజ చేసిన డిస్కోరాజా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కి, దారుణంగా ప్లాప్ అయింది. అందుకే ఇప్పట్లో సీరియస్ కథలు ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లకూడదని రవితేజ భావించాడట.

ఇలాంటి సమయం లో సంక్రాంతికి వచ్చిన క్రాక్ మూవీ సూపర్ హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. క్రాక్ సక్సెస్ తర్వాత ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ తన కెరీర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

మీ లైఫ్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు ? ఎంత?’ అనే ప్రశ్నకి రవితేజ రియాక్ట్ అవుతూ , ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. అందులో అమౌంట్ 3వేల 5 వందలు. ఆ చెక్కు చాలారోజులు భద్రంగా దాచుకున్నా. తర్వాత మనీ బాగా అవసరమై చెక్ బ్యాంకులో ఇచ్చేసా’ అని ఫన్ టచ్ ఇచ్చాడు. ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. కాగా గతంలో వీర సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాకి రవితేజ కమిట్ అవ్వడమే కాకుండా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.