క్రాక్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Star Hero Reject Krack Movie: కొన్ని కాంబినేషన్స్ హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. అలాగే మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి. ఇక తాజాగా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా క్రాక్ ఈ సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా కథను గోపీచంద్ మలినేని మొదట వెంకటేష్ కు వినిపిస్తే, ఎందుకో ఆసక్తి చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

ఇక అప్పటికే ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకు గోపీచంద్ మలినేని కథ వినిపించడం తో ఒకే చెప్పేయడం సినిమా పట్టాలెక్కడం చకచకా నడిచింది. రవితేజ అభిమానులు సైతం ఈ కథ రవితేజకే బాగా సూట్ అవుతుందని అనుకున్నారు. సరిగ్గా అదే జరిగింది. నిజానికి 2017 సంవత్సరంలో రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి విడుదలైన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు.

టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా ఇలా వరుసగా 4 ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు. సంక్రాంతి కానుకగా నెల 9వ తేదీన క్రాక్ సినిమా విడుదల కాగా క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ గా చేసిన శృతిహాసన్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి.