వయసు పెరిగినా యవ్వనంగా కనపడాలా… ఇది ఫాలో అవండి

Homemade Face Pack : ముఖం మీద ముడతలు చర్మం పొడిగా మారటం చర్మం సాగటం వంటి సమస్యలను కనబడకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీనికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి క్రీమ్స్ లోషన్స్ వాడుతూ ఉంటాం. అయినా ఫలితం పెద్దగా ఉండదు. తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే వస్తువులతో చర్మాన్ని యవ్వనంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మ సమస్యలు వస్తాయి వీటికి చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి.

ఒక గిన్నెలో ఎగ్ వైట్ పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే ముఖం మీద ముడతలు సన్నని గీతలు మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం యవ్వనంగా కనబడుతుంది. చర్మం యవ్వనంగా కనబడాలంటే కెరోటిన్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ పైన చెప్పిన ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది