ఫ్రిజ్ లో కాఫీపొడి పెడుతున్నారా… ఏం జరుగుతుందో తెలుసా ?
kitchen tips in telugu :ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లు అంటూ లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో ను ఫ్రిజ్ ఉంటుంది. ఫ్రిజ్ ధరలు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఫ్రిజ్ లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టేస్తున్నారు. అసలు ఫ్రిజ్ లో ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదు అనే విషయం మీద మనలో చాలా మందికి అవగాహన లేదు. ఫ్రిజ్ లో పెట్టకూడని ఐటమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మంది కాఫీ ప్యాకెట్ సగం వాడి ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటాం ఇలా పెడితే కాఫీపొడి పాడవకుండా ఉంటుందని భావిస్తాం.
కానీ, ఇలా చేయడం వలన కాఫీ పౌడర్‌లో ఉండే హైగ్రోస్కోపిక్ నేచర్ అంటే తేమను ఏక్కువగా పీల్చుకుంటుంది.ఫలితంగా, కాఫీ ఫ్లేవర్ మారిపోవడంతో పాటు అందులో ఉండే పలు పోషకాలు కూడా నాశనం అయిపోతాయి.దీని వల్ల ఈ కాఫీ పొడిని తీసుకున్నా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.