Devotional

అరచేతుల్లో ఉండే రేఖలు ఏమి చెప్పుతాయో తెలుసా?

ప్రతి ఒక్కరి అరచేతిలోను రేఖలు ఉంటాయి. ఈ రేఖలను బట్టి భవిష్యత్ ను చెప్పటం మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ రేఖలను నమ్మవచ్చా? ఈ రేఖలలో ఒక గీత ధన లాభాన్ని, మరో గీత అయుష్హు, మరో గీత పెళ్లి,పిల్లల గురించి చెపుతుందని ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ ఉంటారు.

అయితే మన అరచేతిలో హృదయ రేఖలు ఉంటాయి. వీటి గురించి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు. ఈ రేఖకు వలన కలిగే లాభాల గురించి చెప్పుకుందాం. మ‌న అర‌చేతుల్లో ఉండే హృద‌య రేఖ మ‌న‌కు ఉన్న భావాల‌ను, మాన‌సిక, శారీర‌క, సంబంధ‌, బాంధ‌వ్యాల గురించి తెలియ‌జేస్తుంది. ఇది రెండు చేతుల్లోనూ ఉంటుంది. అయితే కొంద‌రిలో ఈ రేఖ‌లు మధ్య‌లో ఎలాంటి అడ్డు లేకుండా నిటారుగా ఉంటాయి.

మ‌రి కొంద‌రిలో ఈ రేఖలు వంక‌ర టింక‌ర‌గా, ఒక‌టిగా ఎక్కువ‌గా, మ‌రొక‌టి త‌క్కువ‌గా, మ‌ధ్య‌లో ఆగుతూ ఉంటాయి. అయితే చిత్రంలో చూపిన విధంగా రెండు హృద‌య రేఖ‌లు క‌లిసి ఒక స్ట్రెయిట్ లైన్ (స‌ర‌ళ రేఖ‌)లా ఏర్ప‌డితే వారు బాగా శాంత‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటార‌ట‌. అంతేకాక వీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

రెండు చేతులు క‌లిపిన‌ప్పుడు హృద‌య రేఖ‌లు స‌రిగా క‌ల‌వ‌క‌పోయినా, ఒక‌టి ఎక్కువ‌గా, మ‌రొక‌టి త‌క్కువ‌గా ఉన్నా, మ‌ధ్య‌లో ఆగిపోయినా అలాంటి వారు పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వం క‌లిగి ఉంటార‌ట‌. వీరు స‌మాజంలో తెలివైన వారీగా గుర్తింపు పొందుతారు. ఇటువంటి వారు వివాహం చేసుకుంటే త‌మ కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న‌వారికే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

హృద‌య రేఖ‌లు రెండూ సెమి స‌ర్కిల్ (అర్థ వృత్తం) లేదా సగం చంద‌మామ ఆకారంలో ఏర్ప‌డితే అలాంటి వారు దృఢ‌మైన చిత్తం క‌లిగి ఉంటారు. వారి మ‌న‌స్సు చాలా దృఢంగా ఉండటమే కాక స్వ‌తంత్ర భావాల‌ను క‌లిగి ఉంటారు. ఇలాంటి వారు ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతార‌ట‌. త‌మ స‌హజ స్వ‌భావాన్ని చాటుకునేలా న‌లుగురితో ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌.