బిగ్ బాస్ హౌస్ లో దొంగ కెమెరాల గుట్టు రట్టు…తెలిస్తే షాక్…?

bigg boss 1 siva balaji :ఎన్నో వివాదాల నడుమ నడుస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో ఎంట్రీ ఇచ్చాక ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుంది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని, మూడు,నాలుగు సీజన్స్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. కరోనా కారణంగా నాల్గవ సీజన్ ఉంటుందో ఉండదో అనుకుంటే మొత్తానికి నడిపించేసారు. ఈసారి 16మంది కంటెస్టెంట్స్ మాత్రమే పాల్గొన్నారు.

కంటెస్టెంట్స్ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఫాన్స్ ని కూడా సంపాదించుకున్నారు. హౌస్ లో జరిగే రచ్చ కూడా ఒక్కోసారి వినోదం పంచినా, ఒక్కోసారి వివాదానికి తావిచ్చేది. అయితే బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ కెమెరాలు నిత్యం పనిచేస్తూ లవ్ స్టోరీ లు, కాంట్రవర్సీలు బయట పెడతాయని పలు సందర్భాల్లో తేలింది. ఈ ఫుటేజ్ గురించి రకరకాల వ్యాఖ్యలు వింటున్నాం.

తాజాగా సీజన్ వన్ కి సంబంధించిన సీక్రెట్ కెమెరాల గురించి ఓ ఇంటర్యూలో నటుడు శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు దొంగ కెమెరాలంటూ 4వ సీజన్ గురించి అడగ్గా, లోపల స్నేహంగా ఉండొచ్చని, కానీ బయటకు చూపించేది మరోలా ఉంటుందని చెప్పాడు. 4వ సీజన్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని చెప్పాడు. లోపల జరిగేదానికి, బయట చూపించేదానికి అసలు సంబంధమే ఉండదని చెప్పాడు.