ఆనంద్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress Kamalinee Mukherjee : మంచి కాఫీ లాంటి సినిమా కాప్షన్ తో టాలీవుడ్ లో ఆ మధ్య వచ్చి అలరించిన ఆనంద్ సినిమాతో మనందరినీ ఆకట్టుకున్న కమిలిని ముఖర్జీ ఆతర్వాత కొన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ కోల్ కత్తా బ్యూటీ అందం , అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ తన సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది.

ఈ మధ్య సినిమాలు కూడా తగ్గిన ఈ భామ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ఈమె నటించిన చిత్రంలోని టాలీవుడ్ నటుడి ప్రేమలోనే పడిందని , త్వరలోనే పెళ్ళికి సిద్ధమవుతోందని టాక్. సినిమాలు తగ్గడంతో పెళ్ళిచేసుకోవాలని సెటిల్ కావాలని భావిస్తోందట. అయితే ఎన్ని వార్తలు వస్తున్నా కూడా ఈమె నుంచి క్లారిటీ లేదు, ఖండన లేదు.

కమిలిని పెద్దగా సినిమాలు కూడా లేనందున ఇలాంటి వార్తలు వైరల్ అయినా, అవ్వకపోయినా పెద్ద ప్రయోజనం లేదు. అందుకే ఆమె స్పందించలేదని కూడా కొందరు అంటున్నారు. ఆ మధ్య మోహన్ లాల్ నటించిన మన్యం పులి మూవీ తర్వాత మళ్ళీ కమిలిని నటించలేదు. అయితే ఈమె పెళ్లిచేసుకోబోయే వ్యక్తి గురించి వస్తున్న వార్తలు పరిశీలిస్తే, అతడికి గతంలో పెళ్ళికావడం, విడాకులు కూడా తీసుకోవడం జరిగాయని, అందుకే ఇక సినిమా పరిశ్రమకు చెందిన అమ్మాయితో పెళ్ళికి వద్దని ఇంట్లో వాళ్ళు స్పష్టంచేశారట. అందుకే ఈమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.