MoviesTollywood news in telugu

ఈ బాల నటిని గుర్తు పట్టారా…ఇప్పుడు స్టార్ హీరోయిన్…ఎవరో చూడండి

Telugu actress aishwarya rajesh :ఇండస్ట్రీలో కొందరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. అదేకోవలో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ కి ఎదుగుతున్న నటుడు రాజేష్ అర్ధాంతరంగా తనువు చాలించాడు. మల్లెమొగ్గ, రెండు జడల సీత, అలజడి లాంటి ఎన్నో మంచి సినిమాలు చేసాడు. హాస్య బ్రహ్మ జంధ్యాల తన సినిమాల ద్వారా రాజేష్ కి మంచి గుర్తింపు తెచ్చారు.

ఇక హాస్య నటి శ్రీలక్ష్మికి రాజేష్ స్వయానా తమ్ముడు. కమెడియన్ గా శ్రీలక్ష్మి 500 కి పైగా చిత్రాలలో నటించారు. అలాగే అమర్ నాథ్ గారు ఐశ్వర్య కి తాతగారు అవుతారు.ఇలా కుటుంభ సభ్యులు అందరు కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే. అయితే దాదాపు 45సినిమాలు చేసి, మంచి ఫార్మ్ లో ఉండగా రాజేష్ మరణించడంతో ఆయన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది.

చెన్నై లోనే పుట్టి, పెరిగిన ఐశ్వర్య 8 ఏళ్ల వయసు. ఆమెతో పాటు నలుగురు సంతానం. పెద్దగా చదువుకోని తన తల్లి ఎంతో కష్టపడి పోషించారట. ఐశ్వర్యకు ముగ్గురు అన్నయ్యలు. అందులో ఇద్దరు అన్నయ్యలు చనిపోయారు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులోకి రాలేదు. ఐశ్వర్య ముందుగా తమిళంలో 25 సినిమాలు , రెండు మలయాళం సినిమాలు, హిందీలో ఒక సినిమా కూడా చేసింది.

అయితే తెలుగులో నటించడానికి మంచి పాత్ర కోసం వేచి చూసి చివరకు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్ర దొరికిన కౌసల్య కృష్ణమూర్తి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్ర పోషించాడు. అలా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రాంబంటు సినిమాలో రాజేంద్రప్రసాద్ తో కలిసి ఐశ్వర్య చిన్నప్పుడే బాల నటిగా నటించింది.

ఆ సినిమాలో ఒక పాట మధ్యలో రాజేంద్ర ప్రసాద్ ని ముద్దు పెట్టుకునే సీన్ లో నటించింది. అప్పట్లో ఆ షాట్ తీయ డానికి దాదాపు పదిహేను టేక్స్ తీసుకుందట. ఎందుకంటే రాజేంద్రప్రసాద్ ని ముద్దుపెట్టుకుని వెంటనే తన పెదవి చేతితో తుడిచేసుకునేదట. దీంతో రాజేంద్ర ప్రసాద్ నవ్వుతూ’ ఏంటి పిల్లా, నన్ను ముద్దు పెట్టుకుని తుడిచేసుకుంటున్నావ్’ అని అడిగాడట. ఐశ్వర్య తండ్రి రాజేష్ కి రాజేంద్రప్రసాద్ మంచి ఫ్రెండ్ కూడా.