నిమిషంలో గ్యాస్,అజీర్ణం,కడుపులో మంట పోగొట్టే సూపర్ టిప్
Acidity home remedies :ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గ్యాస్, కడుపులో మంటతో చాలా ఎక్కువమంది బాధపడు తున్నారు. సమయానికి భోజనం చేయకపోవడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారంతీసుకోవటం…ఇలా కారణాలు ఏమున్నా కడుపులో మంట, గ్యాస్ సమస్యలు మనల్ని విపరీతంగా బాధిస్తుంటాయి. అయితే ఇందుకోసం మెడికల్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అది ఎలాగో మీరే చూడండి…
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని భోజనానికి గంట ముందుగా లేదా భోజనం చేసిన గంట తర్వాత తీసుకోవాలి. లేదంటే రాత్రి పూట నిద్రపోవటానికి అరగంట ముందు కూడా తాగవచ్చు. దీంతో కడుపులో మంట, గ్యాస్ తగ్గుతాయి. ఆహారం కూడా జీర్ణమవుతుంది.