పసుపు ఇలా వాడితే చాలా వేగంగా బరువు తగ్గవచ్చు…ఎలా అంటే…

weight loss tips in telugu :పూర్వ కాలం నుంచి పసుపును వంట‌ల్లోనూ, ఆయూర్వేదంలోనూ, పూజ‌లోనూ, సౌందర్య చిట్కాలలో ఇలా అనేక ర‌కాలుగా ఉప‌యోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పసుపు సర్వ రోగ నివారిణి అని చెప్పవచ్చు. పసుపులో ఉన్న లక్షణాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఒక దివ్యౌష‌ధంగా పనిచేస్తుంది.

పసుపును ఇప్పుడు చెప్పే విధంగా వాడితే చాలా అద్భుతంగా పనిచేయటమే కాకుండా అధిక బరువు తగ్గటమే కాకుండా ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. పసుపు ని ఎలా వాడాలో రెండు పద్దతులు తెలుసుకుందాం.

మొదటి పద్దతి
పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి అర స్పూన్ పసుపు,చిన్న అల్లం ముక్క,పావు స్పూన్లో సగం మిరియాల పొడి,రెండు నిమ్మ చెక్కలు వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత గ్లాస్ లోకి వడకట్టి తేనె కలుపుకొని ఉదయం పరగదుపున తాగాలి. ఈ విధంగా తాగటం వలన శరీరంలో అదనపు కొవ్వు కరగటమే కాకుండా శరీరంలో విషాలను బయటకు పంపుతుంది.

రెండో పద్దతి
ఒక స్పూన్ పసుపులో అరస్పూన్ వంటకు వాడే కొబ్బరినూనే,చిటికెడు మిరియాల పొడి కలిపి ఉదయం పరగదుపున తీసుకోవాలి. పసుపు,కొబ్బరినూనే,మిరియాల పొడి ఈ మూడు బరువు తగ్గటానికి బాగా సహాయపడతాయి.