జుట్టు విపరీతంగా రాలిపోతుందా…ఇలా ట్రై చేయండి

Hair fall tips in telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా,అలాగే ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలటం ప్రారంభం కాగానే కంగారూ పడిపోయి అనేక రకాల నూనెలను వాడుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా ఖర్చు పెట్టకుండా కరివేపాకుతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఓ గ్లాస్ మంచినీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత… ఓ నాలుగైదు కరివేపాకుల్ని నోట్లో వేసుకొని… కరకరా నమిలేయాలి. ఆ తర్వాత అరగంటపాటూ ఏమీ తినకుండా ఉండాలి. కరివేపాకుల్లో విటమిన్ C, ఫాస్పరస్, ఐరన్ (ఇనుము), కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే… జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.