MoviesTollywood news in telugu

సర్దార్ కృష్ణమనాయుడు సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Sardar Krishnama Naidu Full Movie :ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు స్పూర్తితో సూపర్ స్టార్ కృష్ణ ఆరోజుల్లో కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చేసిన సినిమా సర్దార్ కృష్ణమనాయుడు. అలాగే వృద్ధ పాత్రలు వేయరాదని నిర్ణయించుకుని పాత్ర నచ్చడంతో మనసు మార్చుకుని చేసిన సినిమా ఇది. ఉత్తిచేతులతో పులిని చంపి సర్దార్ బిరుదు పొంది , చేయని నేరానికి జైలుకి వెళ్లిన పాత్రలో కృష్ణమనాయుడు, అతడి కొడుకు వేణుగా కృష్ణ డబుల్ రోల్ వేసాడు.

తన ఇల్లాలిని హతమార్చిన వారి అంతుచూసే కృష్ణమనాయుడు పాత్రను కృష్ణ అద్భుతంగా పోషించాడు. తండ్రి పాత్ర పవర్ ఫుల్ గా ఉంటె, కొడుకు పాత్ర చిలిపిగా కృష్ణ నటించాడు. పోలీసాఫీసర్ గా రంగనాధ్ , డాక్టర్ గా శారద, లాయర్ గా రావు గోపాలరావు, కాంట్రాక్టర్ గా సత్యనారాయణ, సత్యనారాయణ కూతురుగా విజయశాంతి, కొడుకుగా పరుచూరి గోపాలకృష్ణ నటించారు.

ఇక లో బడ్జెట్ మూవీస్ తీసిన బీహెచ్ వరహాల రాజుకి ఇదే భారీ బడ్జెట్ మూవీ. చాలా కాలం మంచి కథ కోసం కృష్ణ, కోదండరామిరెడ్డి ఆలోచించి ఈ సినిమా దొరకడంతో తెరకెక్కించారు. అప్పట్లో 1కోటి రూపాయలు ఖర్చు అయింది. 1985లో వీరి కాంబోలో వచ్చిన పల్నాటి సింహం రిలీజై , ఘనవిజయం సాధించింది. 1986లో ఖైదీ రుద్రయ్య కూడా సూపర్ హిట్ అయింది. జూన్ సెంటిమెంట్ తో 1987జూన్ లోనే సర్దార్ కృష్ణమనాయుడు రిలీజ్ చేసారు. కానీ సెంటిమెంట్ బెడిసికొట్టింది.