ఫిబ్రవరి 16 రాశి ఫలాలు…ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Today Rasi Phalalu in Telugu : ఈ రోజు అంటే ఫిబ్రవరి 16 మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరిక ఉండటం సహజమే. అందుకే ఈ 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం

మేష రాశి
వీరి వ్యాపారంలో లాభాలు వస్తాయి పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది.తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి.

వృషభ రాశి
ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది టెన్షన్ అలసట తొలగి కొంత రిలీఫ్ గా ఫీలవుతారు హాయిగా ఆనందంగా జీవితం గడపటానికి మార్పు వచ్చే సమయమే ఈరోజు. కాబట్టి ఈ రోజున సద్వినియోగం చేసుకోవాలి.శ్రీ సూక్తం పారాయణ చేయాలి

మిధున రాశి
ఆర్థిక సమస్యలు తీరుతాయి అనుకోని శుభవార్త వింటారు ప్రతి ఒకరికి సహాయం చేయాలనే ఆలోచనతో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది తల్లిదండ్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. తీపి పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెడితే ఆరోగ్యం బావుంటుంది. ఏ పని చేసిన బాగా కలిసివస్తుంది.

కర్కాటక రాశి
ప్రయాణాలు కలిసొస్తాయి వ్యాపారం బాగుంది ఆర్థికంగా బాగుంటుంది సమయాన్ని ముఖ్యమైన పనుల కోసం కేటాయిస్తారు హనుమాన్ చాలీసా చదివితే మంచిది. వీరికి పట్టిందల్లా బంగారం అనే రీతిలో ఉంటుంది.

సింహరాశి
ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏమైనా అడ్డంకులు వస్తే శ్రమ లేకుండా బయట పడతారు మీ జీవిత భాగస్వామి కాస్త బిజీగా ఉంది మీతో సమయాన్ని గడపకపోవచ్చు. శివుని పూజిస్తే ఆరోగ్యం బాగుంటుంది

కన్యారాశి
బయటికి వెళితే చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల నుంచి మెప్పు పొందుతారు. ఓర్పుతో కష్టపడి పని చేసి మీ లక్ష్యాలను అందుకుంటారు. వీరు ఏ పని చేసిన బాగా కలిసివస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
మీ ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడుతుందని అంతే ఖర్చులు కూడా పెరుగుతాయి పరిస్థితుల కారణంగా మీరు కుటుంబం మీద కాస్త కోపాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి హనుమాన్ ఆరాధన చేయండి మంచి జరుగుతుంది

వృశ్చిక రాశి
ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కుటుంబం కోసం కష్టపడి పని చేయాలి మీ వలన ఎవరైనా ఇబ్బంది పడితే క్షమాపణ చెప్పాలి అర్థం చేసుకునే తత్వాన్ని పెంచుకోవాలి శ్రీ రామ రక్షా స్తోత్రం చదవాలి

ధనుస్సు రాశి
ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది అదృష్టం మీద ఆధారపడకూడదు ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. వైవాహిక జీవితం బాగుంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చేతికి కంకణం ధరించాలి

మకర రాశి
వ్యాపారంలో తండ్రి సలహాలు కలిసొస్తాయి కుటుంబంలో కొన్ని ఒత్తిడులు ఉంటాయి. ఆయన ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు మంచిది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది

కుంభరాశి
పదిమందిలో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి అప్పుడు ఇతరులను వినిపించగలరు సంపాదించిన డబ్బు నిల్వ ఉండేలా జాగ్రత్త పడాలి హనుమాన్ చాలీసా చదివితే మంచిది

మీన రాశి
ఈ రోజు తీసుకునే కొత్త నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయని డబ్బు అవకాశాలు బాగా పెరుగుతాయి జీవిత భాగస్వామి అర్థం చేసుకుంటుంది హనుమాన్ చాలీసా చదవండి.