‘రాధేశ్యామ్’ కాస్ట్యూమ్స్ ఖర్చు తెలిస్తే షాకవుతారు…ఎంతో తెలుసా?

Radhe shyam images Hd :బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ‌ప్రభాస్‌ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుంటే, పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా చేస్తోంది. ఇద్దరూ ఇంచుమించు ఒకే హైట్ లో ఉంటారు. గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై వంశీ, ప్రమోద, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డార్లింగ్ తర్వాత మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీని ప్రభాస్ నుంచి చూడబోతున్నాం.

సాహో’ విడుదలైన దాదాపు రెండేళ్ల తర్వాత ‘రాధేశ్యామ్‌’తో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే టీజర్ కూడా రిలీజయింది. వేలంటైన్స్‌ డే సందర్భంగా చిత్రయూనిట్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. వచ్చే జూలై 30న ‘రాధేశ్యామ్’‌ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

దాదాపు 50ఏళ్ళక్రితం అంటే 1970 ప్రాంతంలో జరిగిన ఓ లవ్ స్టోరీని తెరకెక్కించాలని డైరెక్టర్ రాధాకృష్ణ అనుకున్నారు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా కాస్యూమ్స్ నుంచి వాతావరణం వరకూ కల్పించాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే. కేవలం 6కోట్లు వరకూ ప్రత్యేక డిజైనర్స్ ని పెట్టి ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం ఖర్చుచేశారట. ఆనాటి వాతావరణం క్రియేట్ కోసం దాదాపు 300కోట్లు పైనే వెచ్చించినట్లు తెలుస్తోంది.