Healthhealth tips in telugu

వీటిని ఇలా తీసుకుంటే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,రక్తహీనత,అలసట అనేవి అసలు ఉండవు

finger millet In Telugu :ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్యను ఎనీమియా అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఐరన్ శాతం తగ్గటం వలన రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
blood thinning
రక్తహీనత సమస్య కారణంగా తీవ్రమైన అలసట, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఒంటి నొప్పులు వాతావరణం చల్లగా ఉన్నా సరే శరీరం చల్లగా మారటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనతను తగ్గించే కొన్ని ఆహారాలు తీసుకుంటే ఫలితం ఉంటుంది

వాటిల్లో రాగులు రక్తహీనత సమస్యలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు రాలే సమస్య ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది.,

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.