ఖిలాడీ మాస్ మహారాజను నిలబెట్టేనా…అనుమానమా…?

Ravi teja khiladi movie :ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన విక్రమార్కుడు రవితేజా సరైన హిట్ కోసం చూస్తున్న తరుణంలో ఇండస్ట్రీని కరోనా దెబ్బకొట్టింది. మొత్తానికి నెమ్మదిగా కోలుకుంటోంది. ఇక మొన్న సంక్రాంతికి క్రాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన రవితేజా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.

దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిల్చి రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. తాజాగా ఖిలాడీ మూవీ మీద కూడా రవితేజ గట్టి ఆశలు పెట్టుకున్నా డు. ఎందుకంటే ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో విజయాన్ని అందుకోవాలని , తద్వారా పూర్వ వైభవం చాటాలని చూస్తున్నాడు.

వేసవి కానుకగా మే 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ మూవీని రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ చేసే పాత్రలు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి స్కోర్ ఇస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది.