థైరాయిడ్ సమస్య ఉన్నవారు ధనియాలు తీసుకుంటే…

Thyroid problems :థైరాయిడ్ సమస్య అనేది ఒకప్పుడు ఆడవారిలో ఎక్కువగా కనిపించేది ప్రస్తుతం మగవారిలో కూడా కనబడుతుంది. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి స్రవించే హార్మోన్లు మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే దాంతోపాటు అధిక బరువు చికాకు ఒత్తిడి జుట్టు రాలిపోవడం కండరాల నొప్పులు నీరసం వంటివి వస్తాయి. అందువల్ల థైరాయిడ్ సమస్యలను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తగిన మందులు వాడుతూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగవుతుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ధనియాలు చాలా బాగా సహాయపడుతుంది. ధనియాల లో ఉన్న ఔషధ గుణాలు థైరాయిడ్ సమస్యకు చెక్ పెడతాయి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ధనియాల ని వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని తాగాలి. ఈ విధంగా చేయడం వలన ధనియాలు లో ఉండే విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరిచే హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తుంది.