సపోటాతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం

sapota Benefits In Telugu : తియ్యని రుచి కలిగిన సపోటా పండు అంటే మనలో చాలా మందికి ఇష్టం అలాగే సపోటా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి సపోటా లో విటమిన్ సి విటమిన్ ఎ విటమిన్ బి ఐరన్ కాపర్ సోడియం పొటాషియం ఫైబర్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

సపోటా లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఆ విషయం మనలో చాలా మందికి తెలియదు. సపోటా గుజ్జులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి పదిహేను నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు తొలగిపోతాయి

బాగా పండిన సపోట గుజ్జులో బేకింగ్ సోడా కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం మీద మృతకణాలు అన్ని తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.