ఆలివ్ ఆయిల్ ముఖానికి రాసేముందు ఈ నిజాలు తెలుసుకోండి

Olive oil in telugu :ఆలివ్ ఆయిల్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వంటల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే చర్మ సౌందర్యానికి ఆలివ్ ఆయిల్ ను చాలా మంది వాడుతున్నారు ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, విటమిన్ కె,ఒమేగా 6, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ అనేది అన్ని చర్మ తత్వాలకు సెట్ అవ్వదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడకుండా ఉంటే మంచిది ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ రాసినప్పుడు చర్మంపై ఎక్కువగా దుమ్ము,ధూళి పేరుకుపోతాయి దాంతో బ్లాక్ హెడ్స్,మొటిమలు వంటివి వస్తాయి. ఇక పొడిచర్మం వారి విషయానికొస్తే లిమిట్ గా ఉపయోగించవచ్చు. ఎక్కువగా ఉపయోగిస్తే చర్మంపై తేమ తొలగిపోయింది.