రష్మిక టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తుందా …?

Telugu Heroine rashmika mandanna :ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే, రష్మిక మందన్న పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరికొకరు పోటాపోటీగా అగ్రహీరోలతో నటించి హిట్ మీద హిట్ కొట్టేసారు. కిరాక్ పార్టీతో కెరీర్ స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్న తెలుగులో గీత గోవిందంతో స్టార్ ఇమేజ్ తెచ్చేసు కుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో 2020సంక్రాంతికి రిలీజైన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో జోడీ క‌ట్టి, స‌క్సెస్ అందుకుంది. ఆ త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న పుష్ప మూవీ లో ర‌ష్మిక నటించడం అంచనాలు పెంచేసింది‌ పైగా ఇది ప్యాన్ ఇండియా చిత్రం కావ‌డంతో సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ర‌ష్మిక మంద‌న్న‌కు ఆటోమేటిక్‌గా ఇమేజ్ పెరిగింది.

దీంతో ర‌ష్మిక వ‌రుస‌గా బాలీవుడ్ సినిమాల‌తోపాటు ప్యాన్ ఇండియా మూవీలో అవకాశాలు కొట్టేస్తోంది. తాజాగా మిష‌న్ మ‌జ్ను అనే బాలీవుడ్ చిత్రంతో ర‌ష్మిక మంద‌న్న‌బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా చేస్తూనే బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి మ‌రో చిత్రంలో న‌టించ‌డానికి ఛాన్స్ వచ్చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు పుష్ప సినిమాకు డేట్స్ అడ్జ‌స్ట్ చేస్తూ ర‌ష్మిక బిజి బిజీగా మారిపోయింది.

దీనికి తోడు రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రంలోనూ ర‌ష్మిక మంద‌న్న‌నే హీరోయిన్‌ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక‌.. ఇక‌పై ఓ మోస్త‌రు సినిమాల‌ను ప‌ట్టించుకోద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నారు. దీనికి తోడు ముంబైలో ఓ ఖ‌రీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింద‌ట‌. బాలీవుడ్ వ‌ర్గాల‌కు అందుబాటులో ఉండ‌టానికి ర‌ష్మిక ఈ నిర్ణ‌యం తీసుకుందని, ఇక సౌత్ సినిమాల‌ను పెద్దగా ఒకే చెయ్యదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.