ఇది వాడితే మీ జుట్టు ఒక్క వెంట్రుక కూడా రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair Fall Tips In Telugu :ఈ రోజుల్లో మారిన జీవన శైలి ఒత్తిడి ఆందోళన వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది.జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు కొని వేల కొద్ది డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే తక్కువ ఖర్చులో జుట్టు రాలే సమస్య ను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ మూడు ఇంగ్రిడియంట్స్ మనకి సులభంగా ఇంటిలో అందుబాటులో ఉండేవి. కాస్త ఓపికగా ఈ రెమిడీ ని ఫాలో అవ్వాలి.

రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను వడకట్టి నీటిని వేరు చేయాలి. నానిన మెంతులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి పక్కన పెట్టుకోవాలి.

ముందుగా మెంతులు నానిన నీటిని తీసుకొని జుట్టుకు పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత మెంతుల పేస్ట్ ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.