మాఘ మాసంలో ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా ?

Magha Masam Importance In Telugu :సాధారణంగా కొన్ని మాసాలలో ప్రత్యేకంగా దానాలు చేస్తూ ఉంటాం అలా చేసే దానాలు కొన్ని మనకు మంచి చేస్తాయి. కొన్ని దానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ దానం ఇవ్వకూడదు అలా దానం చేస్తే కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం మాఘ మాసం.ఈ మాసంలో దానాలు చేస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు అయితే ఈ పవిత్రమైన మాఘమాసంలో ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం

శుక్ల సప్తమి నాడు గుమ్మడి కాయ,శుక్ల పక్ష చతుర్దశి నాడు వస్త్రాలు పాదరక్షలు దానం చేస్తే సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. అలాగే చెరుకు రసం ఉసిరికాయ దానం చేస్తే కూడా మంచి ఫలితం కలుగుతుంది.

మాఘ మాసం లో బంగారు తులసి దళం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.అన్నదానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.రాగి పాత్ర లేదా కంచు పాత్రలు నల్లని నువ్వులు పోసి దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు