బాదంనూనెలో ఇది కలిపి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం

white hair to black in telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది దాంతో కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులోతెల్ల జుట్టు రావటం వలన ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు వస్తున్నాయి అలాగే డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. తెల్ల జుట్టు వచ్చింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంటి చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు

నువ్వులను పొడిగా చేసి దానిలో బాదం ఆయిల్ కలిపి తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ తో గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

హెన్నా పొడిలో నీటిని పోసి మరిగించాలి దానిలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించాలి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.