Healthhealth tips in telugu

కడుపులో నులి పురుగులు పోవాలంటే… ఇలా చేస్తే సరిపోతుంది

Home remedy for reduce worms in stomach :కడుపులో నులిపురుగులు అనగానే ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. చాలా అరుదుగా పెద్ద వారిలో కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అసలు నులిపురుగులు రావటానికి అపరిశుభ్రత కారణం అని చెప్పవచ్చు.
Acidity home remedies
కడుపులో నులిపురుగులు ఉంటే తరచుగా కడుపునొప్పి రావటం, ఆకలి లేకపోవడం, నీరసం, రక్తహీనత, పోషకాలు గ్రహించే శక్తి లేకపోవడం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ లక్షణాలు కనబడగానే కడుపులో నులి పురుగులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే నులిపురుగుల సమస్య నుంచి బయటపడవచ్చు.

ఒక గ్లాసు వేడి పాలలో పచ్చి బొప్పాయి పేస్టు మరియు తేనె కలిపి తాగాలి ఈ విధంగా తాగటం వలన నులి పురుగులు క్రమంగా నాశనం అవుతాయి. సీతాఫలం నులిపురుగులను నివారించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పండిన సీతాఫలం తింటే సరిపోతుంది. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో తేనె కలిపి తీసుకున్నా సరిపోతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి కలిపి తాగాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రారంభంలో అయితే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. వైద్యుని సలహాతో మందులు వాడుతూ ఈ చిట్కాలు ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది