వాడిన కాఫీ పొడి పాడేస్తున్నారా… ఇలా వాడొచ్చు

Coffee Powder Reuse Tips : మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉన్నారు కాఫీ లో ఒక అద్భుతమైన రుచి ఫ్లెవర్ ఉంటుంది ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే ఏ పని చేయాలనిపించదు ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. అలాగే కాస్త తలనొప్పి ఒత్తిడిగా ఉన్నప్పుడు కూడా ఒక కప్పు కాఫీ తాగి రిలాక్స్ అవుతాం.

ఇన్స్టంట్ కాఫీ కాకుండా డికాషన్ తయారు చేసుకుని కాఫీ తాగుతూ ఉంటారు. అలా డికాషన్ తయారు చేసుకున్నాక కాఫీ పొడి అందరూ పాడేస్తూ ఉంటారు. అలా పాడేయకుండా మరలా వాడుకోవచ్చు ఎలాగో చూద్దాం.

గదిలో కానీ ఫ్రిజ్ లో కానీ చెడు వాసన వస్తున్నప్పుడు చిన్ని కప్పులో కాఫీ పొడి పెడితే చెడు వాసన తొలగిపోతుంది ఎందుకంటే కాఫీ పొడి కి చుట్టుపక్కల వాసనను గ్రహించే గుణం ఉంటుంది

జిడ్డు మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి జిడ్డు పట్టిన పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు

వాడేసిన కాఫీ పొడి లో కొంచెం నీటిని కలిపి తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది