కిడ్నీలో రాళ్ళను కరిగించే అద్భుతమైన ఆకు…మీకు తెలుసా ?

kondapindi aaku uses :మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే ఆ మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు పల్లెటూరి లో ఉండే వారికి చుట్టు పక్కల ఉండే మొక్కలు గురించి బాగా తెలుస్తుంది అలా మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి ఇప్పుడు చెప్పే ఈ మొక్క కిడ్నీలో రాళ్లను కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది

ఈ మొక్కnu ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతున్నారు ఈ మొక్క ఆకుల పొడిని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు అంతే కాకుండా ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ లో కూడా అమ్ముతున్నారు కిడ్నీలో రాళ్ల సమస్య ఉందంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఆ బాధను భరించలేక వేలకొద్ది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు.

కొంతమంది మందులు వాడుతూ కిడ్నీలో రాళ్ళను కరిగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే ఈ ఆకులు ఉపయోగిస్తే కిడ్నీలో రాళ్లు ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి ఈ ఆకు పేరు కొండపిండి ఆకు. కొండలనయినా పిండి చేయగలదనే నమ్మకంతో మన పూర్వీకులు దీనికి కొండ పిండి ఆకు,పాషాన భేధి,తెలగపిండి ఆకు అనే పేర్లు పెట్టారు.ఈ ఆకులను కిడ్నీ సమస్యలు తో భాధ పడేవారు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య నుండి బయటపడవచ్చు.

ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఆకులు దొరకని వారు ఆయుర్వేదం షాప్ లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ తెచ్చుకుని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసి మరిగించి వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి కొండపిండి ఆకు ను పప్పుగా తయారు చేసుకొని కూడా తినవచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు