ఒక కిడ్నీ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి…తీసుకోకపోతే…?

Kidney Diseases In Telugu :సాధారణంగా ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి కానీ కొంతమందికి ఒక కిడ్నీ మాత్రమే ఉంటుంది. ఒక కిడ్నీ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు. ఒక కిడ్నీ ఉన్న వారు తరచుగా డాక్టర్ ని సంప్రదించి తనిఖీ చేయించుకుంటూ ఉండాలి దానికి తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి.

ఒక కిడ్నీ ఉన్నవారు మూడు విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ గా రక్తపోటును తనిఖీ చేసుకోవాలి రక్తపోటు నియంత్రణలో ఉండేలాగా మందులను వాడాలి రక్తపోటు ఎక్కువ అయితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందువల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.

రక్తం నుండి ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు పోతుంది.ఇలా ప్రోటీన్ బయటికి వెళ్లి పోవడం వలన శరీరంలో సోడియం మరియు ద్రవాలను నిలబెట్టే సమతుల్యత కోల్పోయి పొత్తి కడుపు లేదా చీలమండలో వాపు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి.

జి ఎఫ్ ఆర్ తనిఖీ చేయించుకోవాలి. దీనివలన కిడ్నీల పనితీరు రక్త నాళాల నుండి ఎంతమేర మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను తొలగిస్తుందో తెలుస్తుంది. దీన్ని బట్టి వైద్యులు కిడ్నీల పనితీరు అంచనా వేస్తారు