జుట్టు రాలే సమస్య తగ్గి కొత్త జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది

Hair Fall Tips In Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తోంది కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దానిలో ఒక స్పూన్ ఆవిశ గింజలు,ఒక స్పూన్ మెంతులు,ఒక స్పూన్ బియ్యం,7 లేదా వేప ఆకులు,ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా మరిగించి ఒక బౌల్ లోకి వడకట్టాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.