ఇలా తాగితే 3 రోజుల్లో నడుము 36 నుండి 25 కి వచ్చేస్తుంది…ఇది నిజం

Dalchina chekka for weight loss :దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చాలా వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారి అధిక బరువు సమస్య కు కారణం అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవ్వాలి. అలా జీర్ణం కావడానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది.

దాల్చిన చెక్క పొడిని మనం ఇంటిలో తయారు చేసుకుంటే మంచిది ఎందుకంటే మార్కెట్లో దొరికే పొడిలో కొన్ని రసాయనాలు కలిపే అవకాశం ఉంది వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మనం దాల్చిన చెక్క ను మిక్సీలో వేసుకొని పొడి గా తయారు చేసుకుంటే మంచిది. ఇలా మన ఇంటిలో దాల్చిన చెక్క పొడి తయారు చేసుకుంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఉదయం సమయంలో ఒక గ్లాస్ వేడి నీటిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 2 నిమిషాలు బాగా కలిపి 5 నిమిషాలు అలా వదిలేయాలి. అలా వదిలేస్తే దాల్చిన చెక్కలో పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఇప్పుడు దాల్చిన చెక్క నీటిని ఉదయం పరగడుపున తాగాలి. ఇలా 15 రోజుల పాటు తాగితే బరువు దాదాపుగా 2 కేజీలు తగ్గుతారు.