కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలికగా మాయం చేస్తుంది

కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన బూడిద గుమ్మడి శాస్త్రీయ నామం బెనిన్ కాసా హిస్పీడ. బూడిద గుమ్మడి బూడిద రంగులో ఉండి ముట్టుకుంటే బూడిదగా పొడి రూపంలో రాలుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న మొక్కగా దీనికి గుర్తిపు ఉన్నది. బూడిద
గుమ్మడిలో అసలు కొవ్వు ఉండదు. సోడియం,పొటాషియమ్,పిండి పదార్ధాలు,పీచు,మెగ్నీషియం ,క్యాల్షియం ,ఇనుము మరియు విటమిన్ ఎ,సి,డి ఉంటాయి.

గ్యాస్ సమస్య పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది. బూడిది గుమ్మడికాయ రసంలో చిటికెడు ఇంగువ వేసి పరగడుపున తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు మలబద్ధకం సమస్య నుంచి బయట పడాలంటే సాయంత్రం సమయంలో బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగాలి ఈ విధంగా కొన్ని రోజులపాటు తాగితే మలబద్ధకం సమస్య నుంచి బయట పడవచ్చు

బూడిద గుమ్మడికాయ రసంలో కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పిత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి ఈ సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది

కడుపులో నులిపురుగులు ఉంటే ఆకలి వేయదు ఏమీ తినాలని అనిపించదు అలాంటి సమస్య ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయతో రసం తయారు చేసుకొని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.