వేసవిలో నేరేడు పండు తింటున్నారా… ఏమి జరుగుతుందో తెలుసా ?

jamun fruit Benefits In telugu :వేసవికాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి బయటికి వెళ్ళాలి అంటేనే చాలా కష్టంగా ఉంది. రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడుతాయి. వాటిలో నేరేడు పండు ఒకటి. కాస్త వగరు కాస్త తీపి కాస్త పుల్లగా ఉండే నేరేడు పండు లో కాల్షియం,ఐరన్ మెగ్నీషియం,పొటాషియం,సోడియం,విటమిన్ సి విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఇవన్నీ ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో నేరేడు పండు తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య లేకుండా చేస్తుంది శరీరం హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. వేసవి కాలం వచ్చింది అంటే కాస్త నీరసం అలసట నిస్సత్తువ అతిదాహం వంటివి వస్తూ ఉంటాయి నేరేడు పండు తీసుకుంటే ఈ సమస్యలు ఏమీ ఉండవు. అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది