టక్ జగదీశ్ సినిమాలో ఎన్ని హైలెట్స్ ఉన్నాయో తెలుసా?

Tuck Jagadish Movie :కరోనా తర్వాత ఇండస్ట్రీ వేరు, కరోనాకు ముందు వేరు అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే తగ్గినట్టే తగ్గినా కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా పరిశ్రమపై కూడా దాని ప్రభావం పడనుంది. ఇప్పటికే థియేటర్లు తెరవడం, కొత్త సినిమాలు రావడం జరుగుతున్నా , కొత్తగా వస్తున్న వేవ్ మళ్ళీ జనాలను భయపెడుతోంది. ఇక రిలీజ్ డేట్స్ ఇచ్చిన సినిమాలకు ప్రమోషన్ వర్క్స్ వేగం అందుకున్నాయి. ఇందులో భాగంగా నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ వేశారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీలో రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డేనియల్ బాలాజీ-ప్రియదర్శి-తిరువీర్-రోహిణి-ప్రవీణ్ తదితరులు నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇక ఉగాదికి ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్ ఫ్యామిలీ బాండింగ్స్ చెప్పబోతున్నారని టాక్. ఎందుకంటే డైరెక్టర్ మాటలను బట్టి అన్ని ఎమోషన్స్ ను ఈ సినిమాలో చూపించాడట. దీనికి తగ్గట్టు అన్నదమ్ములు జగపతిబాబు-నాని మధ్య సీన్స్ అందరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయట.

ముఖ్యంగా సెకండాఫ్ లో వీరిద్దరి మధ్య వచ్చే రైన్ ఎమోషనల్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని , అలానే చివరి 30 నిమిషాలలో ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్ పార్ట్ మరో హైలైట్ గా నిలుస్తుందని టాక్. టైటిల్ కి తగ్గట్టే నాని ఈ సినిమా అంతటా టక్ లుక్ లోనే కన్పించడం వెనుక కూడా ఓ కథ ఉందట. ఇక మ్యూజిక్ తో దూసుకుపోతున్న థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ – శివ నిర్వాణ డైలాగ్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అంటున్నారు. వేసవి సందర్బంగా ఈనెల 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసారు.