బిగ్ బాస్ హారికకు లక్కీ ఛాన్స్…స్టార్ హీరో సినిమాలో…!?

Telugu Bigg Boss Harika : బిగ్గెస్ట్ రియాల్టీ షోగా నిల్చిన బిగ్ బాస్ ఎన్ని వివాదాలతో నడిచిందో అంతగా ఆడియన్స్ ఆదరణ పొందుతూ వస్తోంది. అయితే బిగ్ బాస్ షో లో చేసిన వాళ్లకు తగిన ఛాన్స్ లు రావడం లేదన్న అపవాదు ఉంది. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్స్ ల్లో ఎక్కువ శాతం మంది ఆ క్రేజ్ ను ఉపయోగించుకోలేదు. కొందరు ప్రయత్నించినా కల్సి రాలేదు. కాని బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ మాత్రం చాలా మందికి ఆ క్రేజ్ కల్సి వస్తోంది.

ఎందుకంటే సీజన్ 4లో వేసిన కొందరు సినిమాలతో బిజీ గా మారిపోగా, మరి కొందరు బుల్లి తెరపై బిజీ గా ఉంటె, మరి కొందరు యూట్యూబ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అంతెందుకు సినిమాల్లో చిన్న ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటే, సోహెల్ ఏకంగా ఇప్పుడు హీరో అయ్యాడు. అఖిల్ కు వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ లభించింది. మోనాల్ తో ఒక సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కూడా హీరోగా మళ్లీ బిజీ అయ్యే పనిలో పడ్డాడు.

అలాగే మెహబూబ్ యూట్యూబ్లో మరింత ఫేమస్ అయ్యాడు. దివి కూడా రెండు మూడు ఆఫర్లు దక్కించుకుంది. ఇక మరో వార్త వైరల్ అవుతొంది. అదేమిటంటే, దేత్తడి హారిక కూడా బిగ్ బాస్ పాపులార్టీతో సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. హారిక కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రెండు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించే ఛాన్స్ కొట్టేసిందట. చిన్నా చితకా సినిమాల్లో చేస్తున్న ఈమె ఒక స్టార్ హీరో సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. హారిక కీలక పాత్రలో కనిపించ బోతున్నట్లు టాక్. మరి ఆ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.