షేవింగ్ తర్వాత చర్మం మంట పెడుతుందా…ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Shaving skin Care In Telugu :యుక్త వయసు నుంచి మగవారిలో గడ్డాలు మీసాలు రావడం సర్వసాధారణమే. కొందరు వీటిని స్టైల్ గా మార్చుకుంటే మరికొందరు రేజర్ సాయంతో షేవ్ చేసుకుంటారు దాని కోసం రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు కొంతమందికి షేవింగ్ తర్వాత చర్మం మంట పుడుతుంది. దాని కోసం ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

కీర దోస చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి ఈ పేస్టు లో పాలను కలిపి మంట ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి

ఒక బౌల్లో ఒక స్పూన్ తేనె అరస్పూన్ నిమ్మరసం కలిపి మంట ఉన్న ప్రదేశం లో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు ఫాలో అవడం వలన మంట తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది