ఎక్సర్‌సైజ్ లేకుండానే 7 రోజుల్లో పొట్టను తగ్గించడం ఎలా?

Weight Loss Tips in telugu : మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్య లో అధిక బరువు సమస్య అనేది ఒకటి మారిన ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ తగ్గడం అలాగే ఎక్కువ సేపు కూర్చుని ఉండిపోవటం వంటి కారణాలతో 25 సంవత్సరాలకే పొట్ట వచ్చేస్తుంది. పొట్ట రాగానే అందరూ కంగారు పడిపోతారు పొట్టను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కఠినమైన డైట్ వ్యాయామం చేస్తారు ఆయన ఫలితం పెద్దగా ఉండదు. ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే చాలా ఈజీగా పొట్టను తగ్గించుకోవచ్చు

ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగాలి అలాగే ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి తినాలి అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తినకూడదు అలాంటి వారు రెండు వెల్లుల్లి రెబ్బలు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.

ఉదయం వెల్లుల్లి రెబ్బలు తిన్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి దీనిలో పంచదార వేయకూడదు. అలాగే ఉప్పు కూడా వేయకూడదు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగటం కష్టంగా ఉంటే కొంచెం తేనె కలుపుకుని తాగవచ్చు

తెల్లని బియ్యం వాడకాన్ని తగ్గించి దానికి బదులుగా రెడ్ రైస్ గోధుమ బ్రెడ్ ఓట్స్ బ్రెడ్ వాడటం ప్రారంభించాలి

వంటలలో దాల్చిన చెక్క పచ్చిమిర్చి అల్లం ఉండేలా చూసుకోండి ఇవన్నీ బరువు తగ్గించడానికి సహాయపడుతాయి

చాక్లెట్ ఐస్ క్రీం షుగర్ ఫుడ్స్ వంటి వాటికి ఈ ఏడు రోజులు దూరంగా ఉండాలి

మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి చికెన్ మటన్ చేపలు గుడ్డు వంటివి ఏమీ తినకూడదు

ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ లు సమృద్ధిగా అందుతాయి

మంచి నీటిని ఎక్కువగా తాగితే మెటబాలిజం రేటు పెరిగి శరీరంలో మలినాలన్నీ బయటకు పోతాయి.ఈ విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గవచ్చు