అఖిల్ మొదటి సినిమా ప్లాప్ కావటానికి కారణం ఇదే

Akhil First Movie :అక్కినేని వారసుడిగా అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ మహేశ్ బాబు మాదిరిగా సూపర్ స్టార్ అవుతాడు అని భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా అఖిల్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హలో మిస్టర్ మజ్ను సినిమా లకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు పెద్దగా రాలేదు.

అఖిల్ మొదటి సినిమా అఖిల్ సినిమా కథ మొదటగా చరణ్ కోసం తయారు చేశారట. అఖిల్ సినిమా కథ తయారు అయ్యే సమయానికి రామ్ చరణ్ స్టార్ హీరోగా గుర్తింపు సాధించడంతో చరణ్ కోసం వేరే కథ సిద్ధం చేశారట. ఈ అఖిల్ కథను కొన్ని మార్పులు చేసి అఖిల్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి తీశారు అయితే అఖిల్ సినిమా కథ కారణంగానే ప్లాప్ అయిందని ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అఖిల్ మూవీ ప్లాప్ దర్శకుడు vinayak మీద కూడా పడింది.