పవన్ వరుస మూవీస్,రెమ్యునరేషన్ వెనుక రహస్యం ఇదే

Pawan kalyan Remuneration :జనసేన పార్టీ పెట్టాక సినిమాలకు దూరం జరిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి,వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా, మరోవైపు కరోనా సోకి కోలుకుంటున్నాడు. ఇక రెమ్యునరేషన్స్ గుర్తించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల లోగా ఎక్కువ సినిమాలు చేసేలా ప్లాన్స్ చేసుకున్న పవన్,అందుకు తగ్గట్టుగా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ,భారీగా రెమ్యునరేషన్,లాభాల్లో వాటా,థియేటరికల్ రైట్స్ వంటివి తీసుకుంటున్నట్లు టాక్. అందులో భాగంగానే ‘వకీల్ సాబ్’ లో 55 నిమిషాల కోసం సుమారు 55 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ కి ముందు రిలీజ్ కావాల్సిన ‘వకీల్ సాబ్’ ఎట్టకేలకు ఈ నెలలో రిలీజయింది.

లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయి, సడలింపులు తర్వాత ఈ సినిమా సెట్స్ పై ఉండగానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు చారిత్రాత్మక మూవీ స్టార్ట్ చేశాడు. ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ 15 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నాడట. కోవిడ్ కారణంగా జాప్యం జరుగుతున్నప్పటికీ ఈ మధ్య పవన్ వేగం పెంచి, దీని కోసం ఇప్పుడు రోజుకి కోటిన్నర వరకు తీసుకుంటు న్నాడని టాక్.

అంతేకాదు, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమా ప్రారంభించి ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయిందని అంటున్నారు. ఈ మూవీకోసం పవన్ దాదాపు 22 కోట్ల వరకు అడ్వాన్స్ తీసుకున్నారట. అంతేకాక ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా పవన్ కే ఇచ్చేలా అగ్రిమెంట్ అయిందట.

అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తీసే సినిమాకు 30 కోట్లు పారితోషికంతో పాటు లాభాల్లో 50 శాతం వాటా పవన్ కే దక్కుతుందని అంటున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒకటి కమిట్ అయ్యాడు. ఈ మూవీకి 40 కోట్లు రెమ్యూనరేషన్ ప్లస్ లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారట. ఇక నిర్మాత బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించగా, తగిన డైరెక్టర్ వేటలో ఉన్నాడు.

ఈ మూవీకి కూడా పవన్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తాజాగా ప్రముఖ నిర్మాత జె.పుల్లారావు కూడా పవన్ కోసం ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే సినిమా చేస్తామని ప్రకటించారు. దీని కోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు వినిపిస్తోంది.