సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉన్న హీరోలు ఎంత మంది ఉన్నారో…?

Tv Serial Actors Turn Producers :వెండితెరకు ధీటుగా బుల్లితెరకు డిమాండ్ ఉండడంతో వివిధ ప్రోగ్రామ్స్ తో పాటు సీరియల్స్ కి గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే పలు సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులకు మంచి గుర్తింపు వచ్చేసింది. ఇక సినిమాల్లో మాదిరి ఇక్కడ కూడా కొందరు హీరోలు సీరియల్స్ నిర్మిస్తున్నారు. వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న ప్రభాకర్ కూడా చాలా సీరియల్స్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. వదినమ్మ సీరియల్ ని ఆయనే నిర్మిస్తున్నారు

ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో వెంకట్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ప్రేమ ఎంత మధురంతో పాటు కల్యాణ వైభోగం సీరియల్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. భార్యామణి,అమెరికా అమ్మాయి వంటి సీరియల్స్ ఓ నటించిన రమాకాంత్ కూడా నిర్మాతగా ఉన్నాడు. ఓ కొత్త సీరియల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు. గుండమ్మ కథ సీరియల్ లో నటిస్తున్న కల్కి రాజా కూడా కొన్ని సీరియల్స్ నిర్మించాడు.

జానకి కలగనలేదు హీరోకి తండ్రిగా చేసిన రాజా రవీంద్ర కూడా ప్రొడ్యూసరే. భార్యామణి,ఆడపిల్ల సీరియల్స్ లో నటిస్తున్న సమీరా భర్త సయ్యద్ అన్వర్ కూడా ప్రొడ్యూసర్. అరవింద సమేత సీరియల్ నిర్మించాడు. నీ వల్లే నీ వల్లే, కుంకుమ పువ్వు సీరియల్స్ నటిస్తున్న జాకీ కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఇక యమలీల ఆతర్వాత సీరియల్ లో నటిస్తున్న హీరో సురేష్ కొమ్మినేని కూడా ప్రొడ్యూసర్ గా ఈ సీరియల్ ని నిర్మిస్తున్నారు.