రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా ?

RaviTeja Movies :టాలీవుడ్ లో మాస్ మహారాజుగా పేరొందిన రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన విక్రమార్కుడు వంటి మూవీస్ తో తన సత్తా చాటాడు. చిన్నా చితకా వేషాలు వేస్తూ లక్షలాది మంది ఆడియన్స్ ని సంపాదించుకున్న రవితేజ మినిమిమ్ గ్యారంటీ అనే లెవెల్ కి చేరాడు. అయితే చెన్నైలో మిత్రులతో కల్సి సినిమా వేషాల కోసం ట్రై చేస్తున్న రోజులను గుర్తుపెట్టుకుని, మిత్రులతో ఓ సినిమా చేసాడు.

మద్రాసు వెళ్లిన రవితేజకు వైవిఎస్ చౌదరితో పరిచయం కలగడం, ఇద్దరూ ఒకే రూమ్ మేట్స్ కావడం విశేషం. వీళ్ళతో డైరెక్టర్ గుణశేఖర్ కలిసాడు. ముగ్గురూ సినిమా ఛాన్స్ ల కోసం ట్రై చేసారు. ముగ్గురూ డైరెక్టర్స్ అవ్వాలనుకుంటే రవితేజ హీరో అయ్యాడు. మిగిలిన ఇద్దరిలో గుణశేఖర్, వైవిఎస్ లతో మంచి పరిచయం కలిగింది. ఈ ముగ్గురు కల్సి నిప్పు మూవీ తీశారు.

గుణశేఖర్ డైరెక్టర్ కాగా, వైవిఎస్ చౌదరి నిర్మాతగా వ్యవహరించాడు. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో టాలీవుడ్ లో అదర గొట్టింది. 20కోట్ల తో తీసిన ఈ మూవీ 46కోట్లు గ్రాస్ తెచ్చింది. ఇక పూరి జగన్నాధ్ తో పరిచయం ఏర్పడడంతో పూరితో వరుసగా సినిమాలు చేసాడు. తన మిత్రులతో తన లైఫ్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు.