9000 పతనం అయిన బంగారం ధర…వెండి 6000 ఢమాల్ !

Today Gold Rate in vizag :బంగారం ధరలు ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా? గత సంవత్సరంతో పోలిస్తే బంగారం,వెండి ధరలు ఇంకా కింద స్థాయిలోనే ఉన్నాయి. గత ఆగస్ట్ లో బంగారం రేటు 56 వేల పైకి చేరింది. అక్కడి నుండి చూస్తే బంగారం ధర దాదాపుగా 9 వేలు పడినట్టు.

వెండి కూడా గత ఆగస్ట్ లో 79800 స్థాయికి చేరింది. అప్పటి నుండి చూస్తే దాదాపుగా 6000 పతనం అయినట్టు. ప్రస్తుతం బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిలు తగ్గి .44,450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయిలు తగ్గి 48,460 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 74,000 గా ఉంది.